27 August, 2026 | 12:44 AM

మల్లారెడ్డి వర్సిటీలో స్కూల్ ఆఫ్

21-05-2024 02:35 AM

అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కోర్సులు

హైదరాబాద్, మే౨౦ (విజయక్రాంతి): మేడ్చల్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ కోర్సులను ప్రారంభించామని, ౨౦౨౪ విద్యాసంవత్సరానికి సంబంధించి అర్హత గల విద్యార్థుల నుంచి గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, డాక్టరేట్ దరఖాస్తులను స్వీకరించనున్నట్టు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ తెలిపారు. ఇంటర్మీడియట్‌లో బీపీసీ చదివిన విద్యార్థులు ఈ కోర్సులు చేసేందుకు అర్హులని పేర్కొన్నారు. సోమవారం యూనివర్సిటీలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈసందర్భంగా వైస్ చాన్స్‌లర్ మాట్లాడుతూ.. ఈ కోర్సులను మొట్టమొదటిసారిగా మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రవేశ పెట్టారని తెలిపారు. యూజీలో బీఎస్సీ నాలుగేండ్లు, అనస్థీషియాొోఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, కార్డియో వాస్కులర్ టెక్నాలజీ, మెడికట్ బయెటెక్నాలజీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, ఆప్టోమెట్రీ, రేడియాలజీ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, క్లినికల్ న్యూట్రిషన్, డైటికల్‌ఫుడ్ సైన్స్, ఫిజియోథెరపీ కోర్సులు, డయాలసిస్ టెక్నాలజీ, రెస్పిరేటర్ థెరపీ, హెల్త్ సైకాలజీ తదితర కోర్సుల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు.