అఖండ భారత సంకల్ప దివస్
14-08-2026 06:52 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో హిందూ వాహిని నగర శాఖ ఆధ్వర్యంలో అఖండ భారత సంకల్ప దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. హిందు వాహిని నాయకులు కార్యకర్తలస్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, భరతమాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ వాహిని నాయకులు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఆగస్టు 14న అఖండ భారత సంకల్ప దివస్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. 1947 ఆగస్టు 15న మత ప్రాతిపదికన దేశ విభజన జరగడం చీకటి రోజు అని పేర్కొన్నారు. . ఈ కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






