16 April, 2026 | 11:59 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

చలానాల రాయితీలు ఫేక్

02-03-2026 12:24 AM
  1. ఆ వార్తలను నమ్మొద్దు
  2. స్పష్టం చేసిన పోలీసులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి1 (విజయక్రాంతి): ట్రాఫిక్ చలానాలపై భారీ రాయితీలు ఇస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతు న్న వార్తలను పోలీస్ శాఖ తీవ్రంగా ఖండించింది. మార్చి 14న జరగబోయే లోక్ అదాలత్ సందర్భంగా పెండింగ్ చలానాలపై డి స్కౌంట్లు ఉంటాయని వస్తున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని, ప్రజలెవరూ వాటిని నమ్మవద్దని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో  స్పష్టం చేశారు. 

 సోషల్ మీడియాలో కేవలం వ్యూస్, లైక్స్ సంపాదించుకోవాలనే కక్కుర్తితో కొందరు పనిగట్టుకుని ఇటువంటి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని  పోలీసులు మండిపడ్డారు. పాత వీడియోలను లేదా గతంలో ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను ఇప్పుడు ఇస్తున్నట్లుగా తప్పు డు థంబ్ నెయిల్స్ పెట్టి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని గుర్తించారు.  తప్పు డు వార్తలు సృష్టించే వ్యక్తులపై  చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.