సౌమ్య కుటుంబానికి పరామర్శ
29-05-2024 12:47 AM
యాదాద్రి భువనగిరి, మే 28 (విజయక్రాంతి): ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన యాదాద్రి జిల్లా యాదగిరిపల్లికి చెందిన సౌమ్య కుటుంబ సభ్యులను ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మంగళవారం పరామర్శించారు. అమెరికా నుంచి సౌమ్య మృతదేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, నాయకులు కల్లెం కృష్ణ, బబ్బూరి శ్రీధర్, బండి జంగమ్మ తదితరులు సౌమ్య తల్లిదండ్రులను పరామర్శించారు.






