కొండగట్టు కాషాయమయం
హనుమాన్ జయంతికి ముందే పోటెత్తిన భక్తులు
రేపటి నుంచి ఆర్జిత సేవలు రద్దు
జగిత్యాల, మే 28 (విజయక్రాంతి): ప్రముఖ క్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధి కాషాయమయంగా మారింది. హనుమాన్ జయంతి కార్యక్రమానికి ముందే భారీగా భక్తులు తరలివచ్చి దీక్షా విరమణ చేపడుతున్నారు. మంగళవారం ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో కిటకిటలాడింది. వేములవాడ రాజరాజేశరసామి దరనానికి వచ్చిన భక్తులు సోమవారం రాత్రి నుంచి కొండగట్టు అంజన్న దరనానికి వస్తున్నారు.
భారీగా తరలివస్తున్న అంజన్న భక్తులతో ఘాట్ రోడ్డు వాహనాలతో నిండిపోయింది. మంగళవారం ఉదయం 4:30 గంటల నుంచి భక్తులను సామివారి దరనానికి అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. దరనానికి 2 గంటలకు పైగానే సమయం పడుతుందని భక్తులు చెప్తున్నారు.
ఈ నెల 30 నుంచి హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో భక్తులు అంజన్న దరనానికి పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొబ్బరికాయల టెండర్‌దారులు ఒక్కో కొబ్బరికాయకు రూ,౪౦ వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారు. కళ్యాణ కట్ట దగ్గర సైతం వంద రూపాయలు ఇస్తేనే తలనీలాలు తీస్తామని భక్తులను డిమాండ్ చేయడంతో వివాదంగా మారింది.
హనుమాన్ పెద్ద జయంతికి ఏర్పాట్లు
కొండగట్టు ఆంజనేయ సామి పెద్ద జయంతి ఉత్సవాలు ఈ నెల 30 నుంచి మూడు రోజులు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు ఆదేశాలతో యంత్రాంగం అంజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 30 న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర సామి వారి ఆలయం నుండి శ్రీ ఆంజనేయ సామి వారికి పట్టువస్త్రాలు తేనున్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ సామి పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 29 నుంచి జూన్ 2 వరకు అన్ని ఆర్జిత సేవలను నిలిపి వేస్తున్నట్లు ఆలయ ఈఓ చంద్రశేఖర్ తెలిపారు.






