మరోసారి సత్తా చూపిన స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ విద్యార్థిని
నిట్ వరంగల్ ఇన్‌స్పైర్ మానక్-లో ప్రతిభ చూపిన సీహెచ్ అన్విత
హైదరాబాద్, జూన్ 27(విజయక్రాంతి): స్థానిక శ్రీనగర్ కాలనీలోని రెజొనెన్స్ స్కూల్ శ్రీనగర్ విద్యార్థిని సీహెచ్ అన్విత ఇన్‌స్పైర్ మానక్-2023 పాల్గొని ఫుట్‌ప్రెస్ నెమాటిక్ లిఫ్టర్ జాక్ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించి జిల్లా, రాష్టస్థాయిలో విజయాన్ని సాధించి, జాతీయస్థా యికి ఎంపికైంది. జాతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ వరంగల్ నిర్వహించిన ఇన్‌స్పైర్ మా నక్ మెంటార్‌షిప్ వర్క్‌షాప్-2026 నిట్ వరంగల్‌లో తన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించి సెం టర్ ఫర్ ఇన్నోవేషన్ నిట్ వరంగల్, సైంటిస్ట్ నిట్ ఇన్‌స్పైర్ మానక్ వారి నుంచి సర్టిఫికెట్‌ను పొంది తన సత్తా చాటింది.
ఈ కార్యక్ర మంలో స్కూల్ డైరెక్టర్ కొండా శ్రీధర్ రావు ఫుట్‌ప్రెస్ నెమాటిక్ లిఫ్టర్ జాక్ ప్రాజెక్‌ను ఇన్‌స్పైర్ మానక్ మెంటార్‌షిప్ వర్క్‌షాప్-2026 నిట్ వరంగల్‌లో ప్రదర్శించి ప్రతిభ చూపిన స్టెమ్‌స్పార్క్ రెజొనెన్స్ స్కూల్ శ్రీనగర్ విద్యార్థిని సీహెచ్ అన్వితను అభినందిం చారు.
ఆయన మాట్లాడుతూ బహుళ అంతస్థుల భవనాలను నిర్మించే కార్మికులకు ఉప యోగపడే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వారి పనులను సురక్షితంగా చేసు కోవడానికి వినూత్న ఆలోచనలతో సమాజంలోని సమస్యలకు పరిష్కారం చూపిస్తూ నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ఎంతో విలువైనది, కార్మికులకు ఉపయోగకరమైనదని, విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దుతూ విద్యను సామాజిక సమస్యలకు పరిష్కారాలు చూ పించే విధంగా విద్యాభోదన చేస్తున్నామని తెలియజేసి, విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.






