7 May, 2026 | 1:41 PM

గ్రూప్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు

10-12-2024 07:10 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఈనెల 15, 16 తేదీల్లో టీజీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో పరీక్షల నిర్వహణపై అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ హమ్మద్ తో కలిసి సమీక్ష చేశారు. ఈ పరీక్షకు 8080 మంది  అభ్యర్థులు హాజరవుతారన్నారు. 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు మొదటి పరీక్ష మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 వరకు రెండో పరీక్ష ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది ఉన్నారు.