సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల డిమాండ్లు న్యాయమైనవే
10-12-2024 07:13 PM
నిర్మల్ (విజయక్రాంతి): సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని టియుటియఫ్ జిల్లా అధ్యక్షులు రవికాంత్ అన్నారు. మంగళవారం దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏళ్ల తరబడి పని చేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వేతనాలు పెంచాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు చరణ్ రెడ్డ, చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






