26 May, 2026 | 4:26 PM

Breaking News

ప్రభుత్వ ఏర్పడ్డ రెండు సంవత్సరాలకె ఆడ బిడ్డలు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడినది   •   బాల్యవివాహాలను నిర్మూలించాలి   •   మంథనిలో రేపు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం విజయవంతం చేయాలి   •   కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •  

నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

09-10-2025 12:00 AM

టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాహుల్ శర్మ 

రేగొండ/భూపాలపల్లి, అక్టోబర్ 8 (విజయక్రాంతి): జిల్లాలో మొదటి విడత జరగనున్న జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికల నోటిఫికేషన్ జారీ, నామినేషన్ల స్వీకరణ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు, భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ రావుల శర్మ బుధవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, తాసిల్దార్లు, ఎంపీడీవో లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 6 జడ్పిటిసి, 58 ఎంపీటీసీ స్థానాలకు మొదటి విడత ఎన్నికలు నిర్వహించనున్నట్లు అక్టోబర్ 9 న (నేడు) నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మొదటి విడత ఘనపూర్, చిట్యాల, రేగొండ, కొత్తపల్లి గోరి, మొగుళ్ళపల్లి, టేకుమట్ల మండలాలకు ఎన్నికలు జరగనున్నట్లు 19 మంది రిటర్నింగ్ అధికారులు నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. నామినేషన్ కేంద్రాలకు 100 మీటర్ల దూరం వరకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయాలని ఎన్నికలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించాలని ఇలాంటి చట్ట విరుద్ధ చర్యలు చోటు చేసుకోకుండా కఠినంగా పర్యవేక్షించాలని సూచించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్ లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, ఏ.ఎస్.పి నవీన్ కుమార్, రిటర్నింగ్ అధికారులు, జిల్లా అధికారులు, తాసిల్దార్ లు, ఎంపీడీవో లు తదితరులు పాల్గొన్నారు.