09-10-2025 12:00:00 AM
బూర్గంపాడు, అక్టోబర్ 8 (విజయక్రాంతి) : బ్రిలి యంట్ నవోద య కోచింగ్ సారపాక ఆధ్వర్యంలో 2025-26 సం వత్సరంకై జరగబోయే నవోదయ మెయిన్ పరీక్ష వ్రాయబోయే విద్యార్థులకు పరీక్ష పై అవగాహన కల్పిం చుటకు నవోదయ మోడల్ పరీక్షను ఈనెల 12న భద్రాచలం బస్టాండ్ వెనుక సిద్దార్ధ ఒకేషనల్ కాలేజ్ నం దు నిర్వహించనున్నట్లు బ్రిలియంట్ నవోదయ కోచింగ్ చైర్మన్ డాక్టర్ బి.ఎన్.ఆర్ ఒక ప్రకటనలో తెలిపారు.
మెంటల్ ఎబిలిటీ, మాథ్స్, లాంగ్వేజెస్ పై ఈ మోడల్ పరీక్ష ఉంటుందని నవోదయ స్కూల్ కి అప్లై చేసుకున్న తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ఈ మోడల్ పరీక్ష లో మొదటి మూడు ర్యాంక్ లు సా ధించిన విద్యార్థులకు కోచింగ్ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. నవో దయ మోడల్ పరీక్ష రాయబోవు విద్యార్థులు ఒక్క రోజు ముందుగా తమ పేర్లను బ్రిలియంట్ స్కూల్ నందు నమోదు చేసుకోగలరని పూర్తి వివరాలకై 9866283566, 7675040619 నెంబర్లకు సంప్రదించగలరు.