calender_icon.png 9 October, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి భావంతో ఆధ్యాత్మిక చైతన్యం

09-10-2025 12:00:00 AM

ములకలపల్లి /దమ్మపేట, అక్టోబర్ 8 (విజయ క్రాంతి): ప్రజలు భక్తి భావంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెం పొందించుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. బుధవారం దమ్మపేట మం డలం నాగుపల్లి గ్రామంలో గ్రామస్తులచే లక్ష్మీనారాయణ స్వామి దేవాల య ప్రాంగణంలో నిర్మించబడిన నూతన హరిహరాత్మజ అయ్యప్ప స్వామి పీఠం ప్రారంభోత్సవ మహోత్సవంలో ఎమ్మెల్యే జారె ఆదినా రా యణ పాల్గొని మాట్లాడారు.

గ్రామ ప్రజలు భక్తి భావంతో నిర్మించిన అయ్యప్ప స్వామి పీఠం ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు  ఈ పీఠం ద్వారా చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించా రు. అయ్యప్ప గురు స్వాములు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.