9 August, 2026 | 1:32 AM

అభివృద్ధి పనులన్నీ రాష్ట్ర నిధులతోనే

09-08-2026 12:00 AM
  1. కేంద్రానివని బండి సంజయ్ చెప్పడం విడ్డూరం
  2. సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కరీంనగర్, ఆగస్టు 8 (విజయ క్రాంతి): కరీంనగర్‌లో అభివృద్ధి పనులన్నీ కేంద్రం నిధులతోనే జరుగుతున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు మార్ ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని, డబ్బులు రాష్ట్రానివి డబ్బా బీజేపీదని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేంద ర్ రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్‌లో ఆ యన విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ జరుగుతున్న అభివృద్ధి పనులలో అర్బ న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంంట్ ఫండ్ 50 కోట్లలో మొత్తం నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌కు రుణం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని అం దులో కేంద్రానిది ఒక్క రూపాయి కూడా వాటా లేదని అన్నారు.

అర్బన్ చాలెంజ్ ఫం డ్ 840 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం 210 కోట్లు ఇవ్వగా హడ్కో రుణం 420 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, కేవలం 25 శా తం వాటా 210 కోట్లు మాత్రమే కేంద్రం ఇ స్తుందని మొత్తం 840 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నట్టు పదే పదే ప్రచారం చేసు కుంటున్నారని ఆయన మండిపడ్డారు. స్మార్ట్ సిటీ బ్యాలెన్స్ 140 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 70 కోట్లు జమ చేసిందని కేంద్ర ప్ర భుత్వ వాటా 70 కోట్లు ఇవ్వకుండా మొండి చేయి చూపిందని వీటన్నింటిపై బండి సం జయ్ కుమార్ చర్చకు సిద్ధమా అని నరేందర్ రెడ్డి సవాల్ విసిరారు.

యూసీఎఫ్ కింద మొదటి విడత ఎంపికలో కరీంనగర్ ఉండే ట్టు కృషి చేయడాన్ని తాము అభినందిస్తున్నామని కానీ మొత్తం నిధులను కేంద్రమే భరిస్తుంది అని చెప్పటాన్ని ఖండిస్తున్నామ న్నారు. సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, కార్పొరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, జగన్ రెడ్డి, నాయకులు పిట్టల రవీందర్, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, లాయక్, ఎండీ చాంద్, బషీర్, హనీఫ్, సాయిరాం, రమణా రెడ్డి, రాజ్ కు మార్, ఖలీల్, ఇమామ్, తదితరులున్నారు.