9 August, 2026 | 2:49 AM

మియాపూర్‌లో దర్పణ్ ఫర్నిషింగ్స్

09-08-2026 12:00 AM

ఘనంగా 10వ స్టోర్ ప్రారంభం

హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ప్రముఖ హోమ్ ఫర్నిషింగ్ బ్రాండ్లలో ఒకటైన దర్పణ్ ఫర్నిషింగ్స్ మియాపూర్‌లోని యూనిస్పేస్‌లో తన 10వ స్టోర్‌ను ప్రారంభించింది. వచ్చే నెలలో తెల్లాపూర్లో 11వ స్టోర్‌ను ప్రారంభించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కొత్త స్టోర్ లో కర్టెన్లు, వాల్‌పేపర్లు, సోఫా ఫ్యాబ్రిక్స్, బ్లైండ్స్, కార్పెట్లు, రగ్గులు, బెడ్‌బాత్ లినెన్ తదితర ఉత్పత్తులతో పాటు డిజైన్ కన్సల్టేషన్, డోర్స్టెప్ సర్వీస్, ప్రొఫెషనల్ ఎగ్జిక్యూ షన్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

దర్పణ్ ఫర్నిషింగ్స్ వ్యవస్థాపకు లు, మేనేజింగ్ డైరెక్టర్ సులేమాన్ హిరానీ మాట్లాడుతూ.. 25 ఏళ్ల ప్రయాణంలో 10వ స్టోర్ ప్రారంభం కీలక మైలురాయిగా నిలిచిందన్నారు. హైదరాబాద్లో వేగంగా అభివృ ద్ధి చెందుతున్న హోమ్ అండ్ ఇంటీరియర్స్ మార్కెట్కు అనుగుణంగా మరిన్ని ప్రాంతాలకు తమ ఉత్పత్తులు, సేవలను విస్తరిస్తామ ని తెలిపారు. కొత్త స్టోర్‌ను అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అపర్ణరెడ్డి ప్రారంభించారు.