14 July, 2026 | 4:22 AM

అర్హులందరూ ఓటరు జాబితాలో ఉండాలి

14-07-2026 01:48 AM

పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్

ఘట్ కేసర్, జూలై 13 (విజయక్రాంతి) : అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రె రాజేష్ పిలుపునిచ్చారు.  పోచారం 8వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  కర్రె రాజేష్ ఆధ్వర్యంలో సోమవారం ఇస్మాయిల్ఖాన్గూడ, యంనంపేట్ లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలతో పాటు సర్ ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ముందుగా అయ్యప్పనగర్లోని హైదరాబాద్ హోటల్ ఇరానీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, బిఎల్‌ఏ లు, పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించి కార్యక్రమాలపై సమీక్షించారు. అనంతరం పార్టీ జెండాలను ఆవిష్కరించి ఇంటింటికీ పర్యటిస్తూ సర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించారు.  ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ మాజీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇటిక్యాల  కృష్ణారెడ్డి, ఓబీసీ సెల్ జిల్లా అడ్వైజర్ శ్రవణ్ కుమార్ గౌడ్, మాజీ ప్రధాన కార్యదర్శి మెట్టు గణేష్ యాదవ్, మాజీ ఉపాధ్యక్షులు బద్రి హేమంత్, పల్లె బాబురావుగౌడ్,  బండ్లగూడ అనిల్ గౌడ్, ప్రభాకర్ గౌడ్, పి. పోశెట్టి, నాగరాజు పాల్గొన్నారు.