calender_icon.png 15 January, 2026 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా గోదాదేవి అమ్మవారి కల్యాణం

15-01-2026 12:18:33 AM

ముగిసిన ధనుర్మాస పూజలు

ములుగు,జనవరి 14(విజయక్రాంతి): ధనుర్మాస ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భా గంగా నిర్వహించే గోదాదేవి అమ్మవారి క ల్యాణ మహోత్సవం బుధవారం కమలాపురం శ్రీ సితారామ చంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో అర్చకుల వేదమంత్రోచ్ఛాణల మధ్య వైభవంగా జరిగింది. స్వామి వారిని కల్యాణం చేసుకునేందుకు గోదాదేవి అమ్మవారు ధనుర్మాసంలో నెల రోజుల పా టు భక్తి శ్రద్ధలతో స్వామివారిని తిరుప్పావై పారాయణంతో మేల్కొలిపి పూజించి ప్రసన్నం చేసుకుంటుందని ఆలయ పండితులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు,అర్చకులు ప్రతాపురం వంశీకుమారాచార్యులు తెలిపారు.

సంవత్సరంలో ఈ ఒక్కరోజే వేంకటేశ్వరుడితో గోదాదేవి పరిణయాన్ని చూసే భా గ్యం కలుగుతుందని గోదాదేవి కల్యాణోత్సవం సాక్షాత్తు తిరుమలలో జరుగుతున్న ట్లుగా అనుభూతి కలుగుతుందని భక్తులు పేర్కొన్నారు. భక్తులు అమ్మవారికి,స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. కల్యా ణోత్సవంతో ఆలయ ప్రాంగణం గోవిందనామ స్మరణలతో మార్మోగింది.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస పూజా కార్యక్రమాలు ముగిశాయి.