ఇథనాల్ ఫ్యాక్టరీ మూసివేయాలని అఖిలపక్షం నిరసన
బెజ్జంకి, మే 13: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీల వల్ల ఏర్పడుతున్న కాలు ష్య సమస్యలపై రై తు యుద్ధం ప్రజా ఆరోగ్యం పేరుతో అ ఖిలపక్ష పార్టీల ఆధ్వ ర్యంలో బుధవారం ప్రజా నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న విషవాయువులు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరంగా మా రాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూమి, నీరు , పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని, రైతుల వ్యవసాయ భూములు తీవ్రంగా నష్టపోతున్నాయని పేర్కొన్నారు. శబ్ద కాలుష్యం కారణంగా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజలు నిరసన తెలుపుతూ ఎంఆర్వో కార్యాలయం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
కాలుష్య నియంత్రణ చర్యలు వెంటనే చేపట్టాలని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, ఈ కార్యక్రమంలో లింగాల సురేష్ డిఎస్పీ మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ,వంగల నరేష్, తిప్పారపు శ్రీనివాస్ , సంగెం మదు , తిప్పారపు మహేష్, బోనగిరి శివ, దొంతరవెని శ్రీనివాస్, నర్సింగ్ ,మాంకాళి సురేష్, సంఘ ఎల్లయ్య, బొమ్మిడి సాయికృష్ణ, బోనగిరి లింగం, పర్షరాములు, నాయకులు మధు, శ్రీనివాస్, లింగయ్య, విజయ్, శంకర్, చంద్రం, మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు.






