లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, యాదవరెడ్డి
ప్రత్యేక పూజలు పూజలు చేసిన ఎమ్మెల్సీలు
గజ్వేల్, మే 13: వర్గల్ మండలం నాచగిరి లక్ష్మీనరసింహస్వామిని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మెదక్ ఎమ్మెల్సీ యాదవ రెడ్డిలు బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఎమ్మెల్సీలు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఆలయ అర్చకులు, అధికారులు ఎమ్మెల్సీలకు శేషవస్త్రం తీర్థప్ర సాదాలు అందజేశారు.
కార్యక్రమంలో ఆలయ ఈవో రంగాచారి, సిబ్బంది సుధాకర్ పాల్గొన్నారు. వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన స్వాగతి తోరణాన్ని తూప్రాన్ మండలం పోతురాజు పల్లి వద్ద బుధవారం ప్రారంభించారు. దాత మన్నే రాజేశ్వర్, అశోక్ కుమార్, పుష్పలతల సహకారంతో నిర్మించిన నూతన ప్రధాన స్వాగత తోరణంను ( కమాన్) ప్రారంభించారు.
వేద పండితులు ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక ఆశీర్వచనలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రవీందర్ గుప్తా, ఈవో బెల్లంకొండ రంగాచారి, ధర్మకర్తలు చందా నాగరాజు, కొత్తపల్లి శ్రీనివాస్, నాయకం శ్రీనివాస్, గాలి కిష్టయ్య, కర్రె పద్మా వెంకటేష్ ఆలయ సిబ్బంది, అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు పోతరాజు పల్లి తూప్రాన్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






