‘సర్’కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి
రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్, ప్రోగ్రాం స్పెషల్ ఆఫీసర్ రాంప్రసాద్
ఎల్బీనగర్, జులై 28 : రాజకీయ పార్టీల ప్రమేయంతోనే ఎస్ ఐ ఆర్ సక్సెస్ అవుతుందని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్, ప్రో గ్రాం స్పెషల్ ఆఫీసర్ డి. రాంప్రసాద్ తెలిపారు. మంగళవారం సరూర్ నగర్ తహసీ ల్దార్ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ పై అఖిలప క్ష పార్టీల నాయకులతో జరిగిన సమావేశం లో ఆయన మాట్లాడారు. డబుల్ ఓటు ఉం టే క్రిమినల్ కేసులు నమోదవుతాయని తెలిపారు.
తప్పనిసరిగా ఆగస్టు 3వ తేదీలోపు పూర్తిచేసిన ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించాలని సూచించారు. ఒక బూత్ లో ఉన్న ఓటు ను తమ కుటుంబసభ్యులకు ఉన్న బూత్ లోకి మార్చాలంటే ఫారం 8 పూర్తి చేసి ఇ వ్వాలని కోరారు. సంక్షేమ పథకాలకు ఎన్యూమరేషన్ ఫారాలకు ఎలాంటి సంబంధం లే దన్నారు.
ఎన్యుమరేషన్ ఫారాలు సకాలం లో పూర్తిచేసి ఎన్నికల సంఘం విధించిన గడువులోపు బిఎల్‌ఓ లకు అందేలా స్థానిక నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పాల్గొన్న నాయకులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, తహసిల్దార్ వేణుగోపాల్ సరూర్నగర్ సర్కిల్ ఏఎంసి శ్రీనివాసరావు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.






