జనాభా లెక్కలు డబ్బులు ఇవ్వాలి
దేవరకద్ర జులై 28 : వేసవి సెలవులలో జనాభా లెక్కలు విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు గౌరవ వేతనముతో పాటు అటెండెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలని దేవరకద్ర మండల తహసిల్దార్ ఎండి హర్షద్,దేవరకద్ర మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబుకి టీఎస్ యుటిఎఫ్ దేవరకద్ర మండల కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
టీఎస్ యుటిఎఫ్ దేవరకద్ర మండల అధ్యక్షుడు కె.శంకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో మీ యొక్క డబ్బులు అందే విధంగా చూస్తామని తెలియజేశారు. అలాగే జనాభా లెక్కల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులందరికీ అటెండెన్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శులు డి అజయ్, ఎం వేణుగోపాల్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు కే శంకర్, డి కృష్ణయ్య పాల్గొనడం జరిగింది






