14 August, 2026 | 7:37 PM

ఇండియా’తోనే సర్వతోముఖాభివృద్ధి

25-05-2024 12:59 AM

పంజాబ్ ఎన్నికల ప్రచారంలో భట్టి 

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి):  కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సుస్థిర ఆర్థిక విధానాలతో దేశ సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ స్టేట్ ఫరీద్ కోట్ నియోజకర్గంలో కాంగ్రెస్ పార్లీ తరఫున నిర్వహించిన ప్రచారంలో భట్టి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.  మోదీ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలతో అనేక కంపెనీలు దేశంలో పెట్టుబడులకు వెనుకడుగు వేశాయన్నారు.  నోట్ల రద్దు, జీఎస్టీ విధింపు, లాక్‌డౌన్ లాంటి అంశాలు కొద్ది మందికి మేలు చేయగా, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయన్నారు.

యూపీఏ హయాంలో ఆర్థిక రంగం అభివృద్ధి చెందడంతోపాటు భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు.  ఇండి యా కూటమి అధికారంలోకి వస్తే దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుందని మోదీ దుష్ప్రచా రం చేస్తున్నారని మండిపడ్డారు.  రాజ్యాంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచేలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం విదేశాల్లో పేరుకున్న నల్లధనం నిల్వలను ఎందుకు వెలికితీయడం లేదో ప్రజలకుసమాధానం చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రె స్ పార్టీయే అండగా ఉంటుందని పేర్కొన్నారు.