19 June, 2026 | 2:52 AM

బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి

19-06-2026 12:19 AM

నాయకన్ గూడెం గ్రామ సర్పంచి పిలుపు

కూసుమంచి, జూన్ 18 (విజయక్రాంతి): నాయకన్ గూడెంలోని బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలోని చేర్పించాలని నాయకున్ గూడెం గ్రామ సర్పంచ్ శ్రీమతి కంచరి సైదమ్మ కొండల్ గారు పిలుపునిచ్చారు.

గురువారం ప్రాథమిక పాఠశాల నాయకన్ గూడెం నందు విద్యార్థులకు ప్రభుత్వంచే ఉచితంగా అందించబడిన పాఠ్య పుస్తకాలు నోట్ పుస్తకాలు విద్యార్థులకు అందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అమ్మవడి వంటిదని, పైసా ఖర్చు లేకుండా ఆంగ్ల మాధ్యమంలో క్రమశిక్షణ కలిగిన విలువలతో కూడిన విద్య అందిస్తున్నారని కాబట్టి గ్రామ ప్రజలందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోని చేర్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మారోజు భీష్మాచారి మాజీ సర్పంచ్ కంచర్ల వీరారెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యులు జహంగీర్ షరీఫ్ గ్రామ పెద్దలు కంచర్ల లక్ష్మారెడ్డి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ చెట్ల ఉపేంద్ర పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి పారుపల్లి స్వర్ణకుమారి ఉపాధ్యాయులు మండవ నర్సయ్య, రమాదేవి,నాగేందర్ ఇంకా గ్రామ ప్రజలు పాల్గొన్నారు.