03-02-2026 01:55:05 AM
ఈ నెల 25 వరకు అప్‌డేట్ చేసుకోవాలి
లేదంటే దరఖాస్తుకు అనర్హులే
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, త్వరలో విడుదల చేయబోయే ఉద్యోగ నోటిఫికేష్ల నేపథ్యంలో అభ్యర్థులందరూ వన్ టైట్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) డేటాను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవానలి టీజీపీఎస్సీ సూచించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ఈ నెల 9 వరకు ఉన్న గడువును ఫిబ్రవరి 25 వరకు పొడిగించింది. ప్రస్తుతం టీజీపీఎస్సీ వద్ద రిజిస్టర్ అయి ఉన్న సుమారు 31.56 లక్షల మంది అభ్యర్థులందరూ తమ వివరాలను సరిచూసుకోవాలని పేర్కొంది.
కొత్తగా పొందిన విద్యార్హతలు, సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్, విద్యా, కేటగిరీ తదితర వివరాలను సరిచూసుకోవాలని సూచించింది. నిర్ణీత గడువులోపల ఓటీఆర్ అప్‌డేట్ చేసుకోని అభ్యర్థులు భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారని హెచ్చరించింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా మిగతా సమాచారాన్ని తెలుసుకుని వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.