6 June, 2026 | 1:46 AM

ఆ సినిమాల బడ్జెట్ వార్తలన్నీ పబ్లిసిటీ జిమ్మిక్కులే!

06-06-2026 12:00 AM

భారతీయ చిత్ర పరిశ్రమలో రాబోయే భారీ బడ్జెట్ చిత్రాల చుట్టూ జరుగుతున్న ప్రచారంపై బాలీవుడ్ స్టార్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయీ షాకింగ్ కామెంట్స్ చేశారు. భారీ బడ్జెట్ సినిమాలపై ఆయన కామెంట్స్ చేశారు. ఇటీవల పాన్-ఇండియా సినిమాలైన ‘రామాయణ’, ‘వారణాసి’ వంటి భారీ బడ్జెట్ (రూ.1000 కోట్లు) వార్తలపై మనోజ్ స్పందిస్తూ.. అదంతా ఫేక్ అని, మేకర్స్ పబ్లిసిటీ కోసం ఆడుతున్న డ్రామాలు, ప్రచారాలు మాత్రమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్‌లో ‘వారణాసి’ చిత్రం గ్లోబల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు నితేశ్ తివారీ ‘రామాయణ’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాల బడ్జెట్లపై వస్తున్న వార్తలు కేవలం ‘పీఆర్ స్టంట్’ (పబ్లిసిటీ జిమ్మిక్కులు) మాత్రమేననంటూ మనోజ్ బాజ్‌పేయీ కొట్టిపారేశారు. ’వారణాసి’ దాదాపు రూ.1,400 కోట్ల భారీ బడ్జెట్‌తో, ‘రామాయణ’ రూ. 4,000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

సినిమా వ్యాపారం, బడ్జెట్ అనేది పూర్తిగా నిర్మాతలకు సంబంధించిన విషయమని, ప్రేక్షకులకు దానితో ఎలాంటి సంబంధం లేదని మనోజ్ బాజ్‌పేయీ స్పష్టం చేశారు. ఇక ఈ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజాచిత్రం ‘గవర్నర్’ జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. 1990లలో భారతదేశం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభం, దేశాన్ని దివాలా అంచు నుంచి కాపాడిన అన్సంగ్ హీరో కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది.