జెన్‌జీ చిత్రంగా మొహబ్బత్
సంతోష్ కల్వచెర్ల, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న నూతన చిత్రం ‘మొహబ్బత్’. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేని అందిస్తూ సలీమ్ మాలిక్ (మ్యాక్) దర్శకత్వం వహించనున్నారు. ఏబీఎస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై అఫ్రోజ్ షేక్ నిర్మిస్తు న్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఈ పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యే నవీన్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నవీన్‌యాదవ్ క్లాప్ కొట్టి, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు.
అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో సంతోష్ కల్వచెర్ల, హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ.. “మొహబ్బత్’ చిత్రంలో అన్ని రకాల అంశాలుంటాయి” అన్నారు. దర్శకుడు మ్యాక్ మాట్లాడుతూ.. “ఎమోషనల్ యూత్‌ఫుల్ జెన్‌జీ చిత్రంగా ‘మొహబ్బత్’ రానుంది. త్వరలోనే మా సిని మా పాన్ ఇండియాగా ప్రేక్షకుల ముందుకు రానుంది” అని తెలిపారు.
‘ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంద’ని నిర్మాత అఫ్రోజ్ షేక్ చెప్పారు. స్టోరీ, డైలాగ్ రైటర్ కలాం మాట్లాడుతూ.. “మొహబ్బత్’లో ఎమోషనల్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి” అని తెలిపారు. అజయ్ ఘోష్, సాత్విక్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీత దర్శకుడు కాగా, వైఎస్ కృష్ణ డీవోపీగా పనిచేస్తున్నారు.






