28 July, 2026 | 1:59 AM

ఆదర్శ కుటుంబం పెద్ద.. చిట్టిబాబు!

28-07-2026 01:24 AM

విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న కుటుంబ కథాచిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47’ (ఏకే47). హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తు న్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిత్రంలోని ప్రధాన పాత్రలను ఒక్కొక్కటిగా పరిచయం చేయనున్నారు. తొలి పాత్రగా విక్టరీ వెంకటేశ్ పోషిస్తున్న ‘చిట్టిబాబు’ పాత్రను పరిచయం చేశారు. అనంతరం శ్రీనిధి శెట్టి, యువినా పార్థవి, రాజా ప్రజ్వల్ పాత్రలను పరిచయం చేయనున్నారు. ఈ నలుగురి పాత్రలు ఈ ఆత్మీయ కుటుంబ కథకు హృదయం గా నిలవనున్నాయి.

ఈ చిత్రంలో వెంకటేశ్.. కుటుంబాన్ని ప్రేమతో, ఆప్యాయతతో, బాధ్యతతో ఒకే తాటిపై నడిపించే కుటుంబ పెద్ద చిట్టిబాబు పాత్రలో అలరించనున్నారు. విడుదలైన పాత్ర పరిచయ వీడియోలో వెంకటేశ్‌తోపాటు శ్రీనిధి శెట్టి, నారా రోహిత్ కనిపిస్తూ, నవ్వు లు, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలతో నిండి న చిత్ర ప్రపంచాన్ని అందంగా పరిచయం చేశారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్; డీవో పీ: రవి కే చంద్రన్; ఎడిటిం గ్: శ్రీకర్ ప్రసాద్.