సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదివిన వారంతా ఉత్తీర్ణులయ్యారు
30-04-2026 12:56 AM
కేసముద్రం, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాసిన 72 మంది విద్యార్థుల్లో 72 మంది ఉత్తీర్ణులు కావడంతో ఆ పాఠశాల 100 శాతం రిజల్ట్ సాధించినట్లు ప్రిన్సిపల్ జయశ్రీ తెలిపారు. ఇందులో 33 మంది విద్యార్థినిలు 500కు పైగా మార్కులతో ఉత్తీర్ణులవడం మరో విశేషంగా పేర్కొన్నారు. 546/600 మార్కులతో అనన్య పాఠశాల ప్రథమ ర్యాంకు సాధించగా, 543/600 మార్కులు సాధించి నందిని, ప్రవళిక ద్వితీయ స్థానంలో నిలిచారు. మహబూబాబాద్ జిల్లాలో నూటికి నూరు శాతం రిజల్ట్ సాధించిన ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయ విద్యార్థుల ప్రతిభను ప్రతి ఒక్కరు అభినందించారు.






