2 July, 2026 | 11:19 AM

మంత్రి పొన్నంపై ఆరోపణలు సరికాదు

12-06-2024 02:02 AM

కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకుడు జెల్లా రమేశ్‌గౌడ్ 

ఎల్బీనగర్, జూన్ 11 : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకుడు జెల్లా రమేశ్‌గౌడ్ హెచ్చరించారు. మంత్రిపై అసత్య ఆరోపణలు చేస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డికి తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు. కౌశిక్‌రెడ్డి చిల్లర వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. మహేశ్వరంలో కాంగ్రెస్ నాయకుడు జెల్లా రమేశ్‌గౌడ్ మంగళవారం విలేక రుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజాపాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అందించడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నిరంతరం శ్రమిస్తున్నారని, అటువంటి వ్యక్తిపై అవినీతి ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎన్నికల్లో ప్రజలను బ్లాక్‌మొయిల్ చేసి గెలిసిన కౌశిక్‌రెడ్డి ప్రజా నాయకుడు పొన్నంపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కౌశిక్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని అన్నారు.