2 July, 2026 | 12:18 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

మట్టిని తరలిస్తున్న 13 టిప్పర్లు సీజ్

12-06-2024 02:01 AM

ఇబ్రహీంపట్నం, జూన్ 11 : సాగర్ హైవేపై వే బిల్స్ లేకుండా నడుపుతున్న 13 టిప్పర్ లారీలను ఇబ్రహీంపట్నం పోలీసులు సీజ్ చేశారు. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. చింతపల్లి మండలం కుర్మపల్లి నుంచి ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టి తరలిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. వాహనాలను తనిఖీ చేసి వే బిల్స్ లేకుండా నడుపుతున్న 13 టిప్పర్లను సీజ్ చేశారు. అనంతరం ఈ కేసును మైనింగ్ అధికారులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.