21 August, 2026 | 10:02 PM

Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •   నేరాల పెరుగుదలను అరికట్టాలి   •   గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •  

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం

12-06-2024 02:02 AM

రూ.9.60 లక్షలు అందజేసిన ముత్తూట్ ఫైనాన్స్

అబ్దుల్లాపూర్‌మెట్, జూన్ 11: తెలుగు రాష్ట్రాలకు చెందిన నిరుపేద కుటుంబాలకు సురక్ష సేవా సంఘం చేయూతనిచ్చింది. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ సహకారంతో ఆర్థిక సహాయం అందజేసింది. నిరుపేద విద్యార్థులకు, ఇంటి పెద్ద కోల్పోయిన యువతుల వివాహాల కొరకు చెక్కును అందజేసింది. తెలంగాణ పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ పీఎస్‌ఆర్ మూర్తి లబ్దిదారులకు రూ.9,60,000 చెక్కు అందజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన 13 మంది మెడికల్, ఇంజి నీరింగ్ విద్యార్థులకు, కుటుంబ పెద్దను కో ల్పోయిన మరో 9 మంది యువతుల వివాహానికి ఆర్థిక సహాయం చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. సురక్ష సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిక్కర గోపీ శంకర్ యాదవ్, అంతర్జాతీయ రైఫిల్ షూటర్  ప్రసన్నకుమార్, ముత్తూట్ ఫైనాన్స్ జోనల్ మేనేజర్ జితేంద్ర కుమార్ పాల్గొన్నారు.