30 June, 2026 | 2:47 PM

ఆరోపణలు అవాస్తవం

12-05-2026 07:27 PM

మానకొండూరు,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం, పచ్చునూరు గ్రామ మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ కూరాకుల పోచాలు, కారోబార్ కూరాకుల శ్రీనివాసులపై కొందరు గ్రామస్తులు పనిగట్టుకొని అసత్యపు ఆరోపణలతో అధికారులకు ఫిర్యాదు చేయడం విచారకరమని పచ్చునూరు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. వందరోజుల పని దినాలలో పోచాలు విధుల్లో లేనప్పటికిని హాజరుకాని కూలీలకు హాజరైనట్లు చూపించి నిధులను ఎలా దుర్వినియోగపరచారని ప్రశ్నించారు. తక్షణం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ను నియమించి కూలీలకు పని దినాలు కల్పించాలని అధికారులను కోరారు.