పబ్లిసిటీ కోసమే మంత్రిపై పాడి ఆరోపణలు
25-06-2024 05:14 AM
- కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ ఇన్‌చార్జి ప్రణవ్‌బాబు
కరీంనగర్, జూన్ 24: పబ్లిసిటీ కోసమే ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఆరోపణలు చేస్తున్నారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌బాబు అన్నారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫ్లు యాష్ స్కాంపై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా నిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పొన్నం ప్రభాకర్ ఉద్యమనాయకుడని, కౌశిక్‌రెడ్డి ఉద్యమ ద్రోహి అని మండిపడ్డారు. మంత్రిపై చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా చెల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్ద రేపు ఉదయం 11 గంటలకు బయటపెట్టాలని సవాల్ విసిరారు. సమావేశంలో సీనియర్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి, సారంగపాణి, వేముల పుష్పలత, రేణుక, శివగౌడ్ పాల్గొన్నారు.






