4 May, 2026 | 10:01 PM

అలసతం వహిస్తే కఠిన చర్యలు

25-06-2024 05:19 AM
  • వైద్య ఆరోగ్య సిబ్బందికి డీఎంహెచ్‌వో హెచ్చరిక

ఆదిలాబాద్, జూన్ 24(విజయక్రాంతి): వరాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది జాగ్రత్త వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ హెచ్చరించారు. ఆదిలాబాద్‌లోని తన కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, సూపర్‌వైజర్లు, సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. దోమల వల్ల, కలుషిత నీటి వల్ల వ్యాధులు ప్రభలే అవకాశమున్నందున ప్రజలకు తగు జాగ్రత్తలు చెప్పాలని ఆదేశించారు. అలసతం ప్రదరించే సిబ్బందిపై చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా మలేరియా అధికారి శ్రీధర్ పాల్గొన్నారు.