ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా, దిష్టిబొమ్మ దహనం
జగిత్యాల: బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా, దిష్టి బొమ్మ దహనం చేశారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించారు. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అదే రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకొని ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్లు సమాచారం.






