9 March, 2026 | 10:56 PM

మరో 800ఈవీ బస్సులు కేటాయించండి

25-05-2025 01:13 AM
  1. కేంద్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
  2. డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్‌మెంట్‌కు అవకాశం కల్పించాలని వినతి

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): హైదరాబాద్‌కు మరో 800 ఎలక్ట్రిక్ బస్సు లు (ఈవీ) కేటాయించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్రమంత్రితో సీఎం భేటీ అయ్యారు. ఇటీవల హైదరాబాద్‌కు 2,000 ఈవీ బస్సులు కేటాయించారని, ప్రస్తుతం నగర అవసరాలను దృష్టిలో పెట్టుకొని పీఎం-ఈ డ్రైవ్ పథకం కింద అదనంగా 800 బస్సులు కేటాయించాలని కోరారు.

ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్‌లు బస్సుల నిర్వహణ చూసేలా హైబ్రిడ్ జీసీసీ మోడల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రమంత్రికి సీఎం సూచించారు. తెలంగాణ ఆర్టీసీ డీజిల్ బస్సు కు రెట్రోఫిట్టెడ్ చేపట్టగా అది సఫలమైందని.. ఆ బస్సు నగరంలో రాకపోకలు సాగిస్తోందని కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్‌మెంట్ అవకాశం కల్పించాలని కేంద్రమంత్రికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.