25-05-2025 01:12:12 AM
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): మే 12న నిర్వహించిన టీజీ ఈసెట్ ఫలితాలు ఆదివారం విడుదల కానున్నట్టు ఈసెట్ కన్వీనర్ పీ. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉస్మానియా వర్సిటీ ప్రాంగణంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రొ.వి.బాలకిష్టారెడ్డి,
ఓయూ వర్సిటీ వీసీ కుమార్ ఈసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) అభ్యర్థులకు బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో ప్రవేశాలు కల్పించనున్నారు.