13 June, 2026 | 4:34 PM

‘ఇస్నాపూర్’కు ప్రత్యేక నిధులు కేటాయించండి

10-06-2026 01:14 AM

మంత్రి వివేక్ ను కోరిన మధు 

పటాన్చెరు, జూన్ 9 : పటాన్ చెరు ని యోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ ని ప్రత్యేకంగా పరిగణించి నిధులు కేటాయిం చాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన సమీక్ష సమావేశానికి హాజరైన జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు వివేక్ వెంకట స్వామినీ ఇస్నాపూర్ చౌరస్తాలో కలసి ఘ నస్వాగతం పలికి నిధులు, పలు సమస్యలపై ఇస్నాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ల ఆధ్వ ర్యంలో వినతి పత్రం ఇచ్చారు.

ఈ సంద ర్భంగా నీలం మధు మాట్లాడుతూ ఇస్నా పూర్ మున్సిపాలిటీ చిట్కుల్ పరిధిలో గల 329 కాలనీ, ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీ లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమ యంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరి గిందని ఆ  కాలనీలో అంతర్గత రోడ్లు, అండ ర్ గ్రౌండ్ డ్రైనేజ్, కరెంట్ పోల్స్, త్రాగునీరు, ఇంటి నెంబర్లు, కరెంట్ మీటర్లు, వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు, అ లాగే  నేషనల్ హైవే నుండి లక్డారం- బ్యాతో ల్ - రుద్రారం - ఏర్థనూర్ వరకు రోడ్డు, ఇరు వైపులా ఐమాక్స్ లైట్స్ ఏర్పాటు చేయాలని, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయిం చిన 15 కోట్ల నిధుల  పనులు ఇప్పటికే ప్రా రంభమైనట్టు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.