calender_icon.png 3 February, 2026 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

2,991 మందికి లా సీట్లు కేటాయింపు

04-10-2024 01:55:16 AM

హైదరాబాద్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): లా కోర్సుల్లో ప్రవేశాల కో సం నిర్వహించే టీజీ లాసెట్ సెకండ్, ఫైనల్ ఫేజ్ సీట్లను అభ్యర్థులకు కేటాయించారు. మొత్తం 3,158 కన్వీనర్ సీట్లు ఉండగా, ఇందులో 2,991 సీట్లను గురువారం కేటాయించారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులో 2,030 సీట్లకు 2,016 సీట్లు కేటాయించారు. ఐదేళ్ల లా కోర్సులో 1,128 సీట్లుంటే, 975 సీట్లను కేటాయించారు.

మొదటి విడుతలో మొ త్తం కన్వీనర్ సీట్లు 6,324 సీట్లుండగా, 3,374 సీట్లు మాత్రమే భర్తీ అ య్యాయి. తుది విడుదలో సీట్లు పొం దిన అభ్యర్థులు ఈ నెల 3 నుంచి 7వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు.