కొత్త కాంబో కుదిరిందా?
ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తన సినిమాల లైనప్ మరోస్థాయిలో ఉంది. ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న చరణ్.. తాజాగా టాలీవుడ్ మాస్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేతులు కలిపారనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నానితో ‘దసరా’ వంటి రా అండ్ రస్టిక్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెల.. ఇప్పుడు రామ్‌చరణ్ కోసం అంతకుమించిన ఒక పవర్‌ఫుల్ స్క్రిప్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ సెన్సెషనల్ డైరెక్టర్.. నేచురల్ స్టార్ నానితో ‘ది ప్యారడైజ్’ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అది పూర్తయిన తర్వాత రామ్‌చరణ్‌తో సినిమాను పట్టాలెక్కించనున్నారట.
ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ కాంబోపై ఇప్పట్నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ‘రంగస్థలం’ సినిమాలో చిట్టిబాబుగా రామ్‌చరణ్ చేసిన మాస్ పర్ఫార్మెన్స్ థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ‘పెద్ది’లో చరణ్ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతు న్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు మించి ఊరమాస్ లుక్ అండ్ క్యారెక్టరైజేషన్‌ను శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాలో చూపించబోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






