హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): దోస్త్ (డిగ్రీ ఆన్‌లైన్ సర్వీ సెస్ తెలంగాణ) స్పెషల్ డ్రైవ్ ఫేజ్ లో భాగంగా 13,093 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోగా, 12,756 మందికి సీట్లను కేటాయించారు. అయితే ఎక్కువ మంది కామర్స్ కోర్సునే ఎంచుకున్నారు. 12,756 సీట్లలో కామర్స్ సీట్లు, ఆర్ట్స్ 2,143, లైఫ్‌సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్ డిఫార్మసీ ఇతర కోర్సుల్లో 3 సీట్లు భర్తీ అయ్యా యి. సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో ఈనెల 13 నుంచి 16 వరకు రిపోర్టింగ్ చేయాలని సూచించారు. ఒకవేళ రిపోర్టింగ్ చేయకుంటే సీటు కోల్పోతారని అధికారులు తెలిపారు.