- చైర్మన్‌గా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కో-చైర్మన్‌గా దామోదర రాజనర్సింహా
- సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం, సీతక్క, ఎంపీ మల్లు రవి
హైదరాబాద్,సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చైర్మన్‌గా ఓ కమిటీని నియమించినట్లు గురువారం సీఎస్ శాంతికుమారి ఓ ప్రకటనలో తెలిపారు. కమిటీ కో- చైర్మన్‌గా మంత్రి దామోదర రాజనర్సింహ, సభ్యులుగా మంత్రు లు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవిని ఎంపిక చేసిందన్నారు.
ఆగస్టు 1న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వర్గీకరణను అమలు చేస్తామని, ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ వర్గీకరణ మేరకే భర్తీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో వర్గీకరణకు ముడిపడి ఉన్న అంశాలన్నింటిపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది.