7 April, 2026 | 7:26 PM

నాలుగు వారాల గడువు ఇవ్వండి

02-05-2024 01:10 AM

ఢిల్లీ పోలీసులకు పీసీసీ లీగల్‌సెల్ విన్నపం

హైదరాబాద్, మే1 (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ మంత్రి వీడియో మార్ఫింగ్ కేసుపై ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై పీసీసీ లీగల్‌సెల్ స్పందించింది. సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నందున వివరణ ఇచ్చేందుకు నాలుగు వారాల గడువు కావాలని కోరారు. సాంకేతిక అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉన్నదని తెలిపారు. కాగా, కాంగ్రెస్ సోషల్ మీడి యా కార్యకర్త గీత ఫోన్‌ను ఢిల్లీ పోలీసులు జప్తు చేశారు. సికింద్రాబాద్ శాంతినగర్‌కు చెందిన ఆమెకు సెక్షన్ 41 ఏ కింద నోటీసులిచ్చి, ఈనెల 5న విచారణకు రావాలని సూచించారు.