7 April, 2026 | 8:58 PM

శాతవాహన ఇంజినీరింగ్ కళాశాలకు 36 గుంటల భూమి కేటాయింపు

07-04-2026 07:08 PM

ముకరంపుర,(విజయక్రాంతి): హుస్నాబాద్ ప్రాంత విద్యా విస్తరణకు దోహదపడే కీలక నిర్ణయాన్ని రెవిన్యూ అధికారులు ఉమ్మాపూర్ గ్రామ సమీపంలోసర్వే నెంబర్ 132/1లొ 36 గుంటల భూమిని శాతవాహన సాంకేతిక కళాశాలకు కేటాయించి ఉత్తర్వులు రిజిస్ట్రార్ కి పంపించారు. ఈ భూమిలో నూతన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కలాశాల నిర్మాణం చేపట్టనున్నారు.

ఈ కళాశాల ద్వారా హుస్నాబాద్ పరిసర ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందుబాటులోకి రానున్నదని, విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుందని,స్థానిక యువతకు మెరుగైన విద్యావకాశాలు కల్పించడమే కాకుండా, హుస్నాబాద్ విద్యారంగంలో కొత్త అధ్యాయం మొదలైందని, ఇది ప్రాంతీయ అభివృద్ధికి నిలుస్తుందని ఉపకులపతి ఆచార్య ఉమేశ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య సతీష్ కుమార్ పాల్గొన్నారు.