బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు, మే 1 (విజయక్రాంతి) : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే కార్మిక రంగంలో విప్లవాత్మక సంస్క రణలు చేపట్టారని, వేల పరిశ్రమలు, లక్షల మందికి ఉద్యోగాలు అందించారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని బీఆర్‌టీయూ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పటాన్‌చెరు నియోజకవర్గం పేరుగాంచిందన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గం వేలాది మంది కార్మికులకు అండగా నిలుస్తుందన్నారు. గత పది సంవత్సరాల్లో వేలాది మంది స్థానిక కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు పరిశ్రమల యాజమన్యాలతో చర్చించి మెరుగైన వేతన ఒప్పందా లను అందించామన్నారు. భవిష్యత్తులో కూడా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి యాదగిరియాదవ్, జిల్లా అధ్యక్షుడు శివశంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




