ఎమ్మెల్యేలు కలిసిన హెచ్ఎంటి నూతన పాలక మండలి సభ్యులు
07-04-2026 07:24 PM
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం హెచ్ఎంటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన పాలక మండల సభ్యులు ఉప్పల్ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డిని మంగళవారం నాడు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడతూ... 30 కోట్ల రూపాయలతో హెచ్ఎంటి నగర్ చెరువు సుందరీకరణకు ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూతన అసోసియేషన్ అధ్యక్షుడు బి.బుచ్చయ్య ఉపాధ్యక్షుడు యాదగిరిరెడ్డి ప్రధాన కార్యదర్శి రామ్ కోటేశ్వరరావు సమృద్ధి కార్యదర్శి కే.శ్రీకాంత్ ఆర్గనైజ్ సెక్రటరీ సామ్రాట్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్ పాల్గొన్నారు




