అల్లు అర్జున్ శక్తిమాన్
శక్తిమాన్ పాత్రతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన హిందీ నటుడు ముఖేష్ ఖన్నా. తాజాగా ఆయన తన యూట్యూబ్ ఛానల్ అయిన ‘భీష్మ్ ఇంటర్నేషనల్‘లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘పుష్ప ది రూల్’ చిత్రాన్ని చూసిన ముఖేష్ ఖన్నా సినిమా నచ్చిందని.. అల్లు అర్జున్ అంతకు మించి నచ్చాడంటూ ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే ‘శక్తిమాన్’ కావల్సిన లక్షణాలు అల్లు అర్జున్‌లో ఉన్నాయని ముఖేష్ ఖన్నా పేర్కొన్నారు. గతంలో ‘శక్తిమాన్’ పాత్రలో నటించేందుకు రణ్‌వీర్ సింగ్ చాలా ప్రయత్నించారట. ముఖేష్‌ను ఒప్పించేందుకు శతవిధాలుగా యత్నించినా కానీ అంగీకరించలేదట. రణవీర్ అద్భుతమైన నటుడే కానీ ఆ పాత్రకు సరిపోరని తేల్చారట. అలాంటి ముఖేష్ ఖన్నా అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ.. “నేనేమీ కమిట్ చేయించడం లేదు, చెప్పడమూ లేదు. అలాగని జడ్జ్ చేయడమూ లేదు. కానీ అల్లు అర్జున్ శక్తిమాన్ చేయలగలరు. నిజ జీవితంలోనూ మంచి లుక్, మంచి హైట్ ఉంటాడు” అంటూ కితాబిచ్చారు.






