డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ రోజు ‘డ్రింకర్ సాయి’ సినిమా నుంచి ‘డ్రింక్సు, డ్రింక్సు, డ్రింక్సు..’ పాటను విడుదల చేశారు. ఈ లిరికల్ సాంగ్‌ను వసంత్ మంచి బీట్ తో కంపోజ్ చేయగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను ఆలపించారు. ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్‌ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత తదితరులు కీలక పాత్రలు పోషించారు.






