రవితేజ కూతురు ఎంట్రీ..
చాలా మంది హీరోలు తమ కొడుకుల్ని పరిచయం చేశారు కానీ కూతుళ్లను పరిచయం చేసిన వారు వెళ్లమీద లెక్కపెట్టినంత మంది కూడా లేరు. విభాగం ఏదైనా కూతుళ్లను మాత్రం ఇండస్ట్రీలోకి రానివ్వరు. రవితేజ మాత్రం తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు. రవితేజ కూతురు హీరోయిన్‌గా కాదు.. దర్శకురాలిగా ఎంట్రీ ఇవ్వనున్నారట. రవితేజకు కొడుకు మహాధన్, కూతురు మోక్షద ఉన్నారు. మహాధన్ అయితే ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి దగ్గర సహాయకుడిగా చేస్తున్నాడట. మోక్షద ప్రస్తుతం దర్శకత్వంలో మెళకువలు నేర్చుకుంటున్నారట. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తీస్తున్న చిత్రానికి మోక్షద సహాయ దర్శకురాలిగా పని చేయనున్నారట. గతంలో రవితేజ కూడా తన కెరీర్‌ను ఇలాగే ప్రారంభించి ఆ తరువాత నటుడిగా మారారు. మరి మోక్షద దర్శకురాలిగానే కంటిన్యూ అవతారో.. లేదంటే హీరోయిన్‌గా మారుతారో చూడాలి.






