వైజాగ్‌లో అల్లు అర్జున్ టాకీస్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినీ అభిమానులకు చక్కటి కా నుకను అందించారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్‌తో కలిసి ఇండియాలో ఎక్కడా లేని అత్యాధునిక సాంకేతికతతో వైజాగ్‌లో ‘ఏఏఏ’ సినిమాస్‌ను నిర్మించారు. ఈ మల్టీప్లెక్స్‌ను ఆదివా రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా.. అల్లు అర్జున్ మాట్లా డుతూ ‘వైజాగ్‌తో నాకు చాలా మంచి అనుబంధం ఉంది. ఈవాళ నా కలలో వైజాగ్లో పెద్ద మాల్ వస్తుంది. అందులో ప్రెస్టీజియస్ థియేటర్ నాకు వస్తుందని అనుకోలేదు. కల నిజమైందని చెప్పటం కంటే ఇది పెద్ద విషయమని చెప్పాలి’ అని అ న్నారు. ఇండియాలో ఎక్కడా లేని స్పెషల్ స్క్రీన్ వైల్ ఫైర్ వైజాగ్లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇదొక థియేటర్ మాత్రమే కా దు. అందరూ ఈ ఎక్స్‌పీరియెన్స్‌ను ఎం జాయ్ చేయాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘నా తండ్రి అల్లు రామలింగయ్య గారికి, నారాయణదాస్ నారంగ్గారికి, సునీల్ నారంగ్, భరత్ సహా స్నేహితులు, సన్నిహితులకు థాంక్స్. వైజాగ్ ప్రజల ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నా ను’ అని చెప్పారు. నిర్మాత భరత్ నారంగ్ మాట్లాడుతూ.. ‘ఇది ఎంతో ఎమోషనల్ మూమెంట్. నా తండ్రిగారితో పాటు అల్లు అరవింద్ విజన్ కారణంగానే ఏఏఏ సినిమాస్ స్టార్ట్ అయ్యింది’ అని చెప్పారు.






