‘కపాలి’ కథానాయికగా హన్సిక
పోలీస్ నేపథ్యంలో సాగే సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ కపాలిలో హీరోగా నారా రోహిత్ నటిస్తున్నారు. రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్నారు. సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై కళ్యాణ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప నిర్మించగా, విజయ్ కృష్ణ లింగమనేని సమర్పిస్తున్నారు.
ఇందులో హన్సిక మోత్వాని కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్, ఫస్ట్- లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హన్సిక పుట్టినరోజు సందర్భంగా మోత్వానీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ లుక్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంటెన్స్ లుక్‌లో హన్సిక కనిపిస్తున్న ఈ పోస్టర్.. ’కపాలి’ కథలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యతను సూచిస్తోంది. ఆమె చుట్టూ ఉన్న మిస్టీరియస్ ఎలిమెంట్స్ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.






