ఐఐఐటీ హైదరాబాద్ ఇంటర్యూకు అల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక
13-05-2026 12:00 AM
కొత్తపల్లి, మే 12 (విజయ క్రాంతి): అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎక్జామినేషన్ లో అల్ఫోర్స్ విద్యార్థులు వూట్కూరి శ్రేయాన్రెడ్డి, గుజ్జుల అశీష్రెడ్డి, గంగడి ఛైత్ర అద్భుత ప్రతిభ కనబరిచి ఐఐఐటి హైద్రాబాద్ లో సీట్లు సాధించడానికి నిర్వహించే ఇంటర్యూకి ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. నిరంతరం కృషి చేస్తే ఎలాంటి పోటి పరీక్షలలో అయిన విజయం సాధించవచ్చని మా విద్యార్థులు నిరూపించారన్నారు. ఇంటర్యూలో కూడ ప్రతిభ కనబరిచి ఐఐఐటి హైద్రాబాద్ లో సీట్లు సాధిస్తారని ఆకాంక్షించారు.






